Moviesషాకింగ్: ఇండస్ట్రీకి గుడ్ బై..స్టార్ కొరియోగ్రాఫర్ సంచలన నిర్ణయం..?

షాకింగ్: ఇండస్ట్రీకి గుడ్ బై..స్టార్ కొరియోగ్రాఫర్ సంచలన నిర్ణయం..?

ప్రభుదేవా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభుదేవా గురించి తెలియని వారంటూ ఉండరన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన శైలితో.. తన నటనతో,డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభుదేవా డ్యాన్స్ ఇరగదీస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఆయన ఒక్క డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన కొన్ని సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ప్రభుదేవా డైరెక్టర్ గా మరి పలు సినిమాలను చిత్రీకరించారు. ఆయన తీసిన సినిమాల్లో ఎన్నో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎగుమతి అయినా సౌత్ స్టార్ లలో ఒకరు ప్రభుదేవా.. డాన్సర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రభుదేవా ఆ తర్వాత ఎన్నో అవతారాలు ఎత్తాడు.

డైరెక్టర్ గా కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాణ్ ఖాన్ హీరోగా.. దిశా పటానీ హీరోయిన్‌గా ఆయన ‘రాధే’ అనే సినిమాను తీస్తే..అది బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్, యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనితో ఆయన పూర్తిగా సినిమాలకి కి గుడ్‌‌బై చెప్పేయాలని ప్రభుదేవా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్‌ లీడ్‌లో నటించనున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభుదేవా మనకు తెర పై కనిపించడం కష్టమే అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news