Moviesదుమ్ముదులిపేసిన పవన్..దెబ్బకు చిరంజీవి అవుట్..!!

దుమ్ముదులిపేసిన పవన్..దెబ్బకు చిరంజీవి అవుట్..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా.. రానా ఒక కీలక రోల్ చేస్తున్నాడు. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా.. టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..అన్నట్లుగానే అదే స్థాయిలో ఫస్ట్ గ్లింప్స్ ఉంది. దీనిని చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాస్తూ తెగ హంగామా చేస్తోంది. ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు.

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే భారీ స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంటూ.. పక్క హీరోల రికార్డులను బద్దలు కొట్టేసింది.’భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్’ విడుదలైన 24 గంటల్లోనే 8.49 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన గ్లిమ్స్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ క్రమలోనే తన బ్రదర్ చిరంజీవి పేరిట ఉన్న నెంబర్ వన్ రికార్డు సైరా నరసింహా రెడ్డి 7.20 మిలియన్ తుడిచేశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news