Gossipsగుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న కత్రినా కైఫ్..రీజన్ తెలిస్తే షాకే..?

గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న కత్రినా కైఫ్..రీజన్ తెలిస్తే షాకే..?

కత్రినా కైఫ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రెండు ద‌శాబ్దాల క్రితం క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అంతే సైజ్‌లో ఆమె ఉంది. క‌త్రినా వయసు పెరుగుతున్న అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఇంత సుదీర్ఘ‌కాలంగా బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కొత్త కొత్త అందాలు బాలీవుడ్ లో అడుగు పెడుతున్న.. ఈ భామ అందం ముందు వాళ్లు ఫ్లాప్ అవుతున్నారు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ పుల్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది.

2004లో వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన క‌త్రినా.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో చేసిన‌ మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత బాల‌య్య హీరోగా వ‌చ్చిన అల్లరి పిడుగు చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌లేదు. అయితే బాలీవుడ్ మాత్రం వ‌రుస అవ‌కాశాలు అంద‌రూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా, వయసు 41కి చేరువ‌వుతున్నా ఈమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

ఇక కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటికే బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. దానికి తగ్గట్టే వీరిద్దరూ ప్రైవేట్‌గా కలుసుకోవడం..అలా కలుసుకున్న ప్రతిసారి మీడియా కంట పడటంతో వీళ్ళు లవ్ బార్డ్స్ అని ఫిస్ అయ్యిపోయారు అందరు. అలా ఈ మధ్యే కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సీక్రెట్‌గా జరిగిన రోకా ఈవెంట్‌లో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ తంతూ ఫినిష్ చేసిన్నట్లు బాలివుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు దీనిపై త్వరలోనే మీడియా ముందు అధికారికంగా చెప్పనునారట ఈ జంట. అసలు నిజంగా వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగిందా? జరిగితే ఎందుకు అంత సైలెంట్ గా చేసుకున్నారు..? ఈ విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news