Moviesపుష్ప‌లో ర‌ష్మీక నటించే పాత్ర గురించి తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..?

పుష్ప‌లో ర‌ష్మీక నటించే పాత్ర గురించి తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..?

అల వైకుంఠపురం అనే బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ప్ర‌స్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సుక్కు అదేనండి లెక్కల డైరెక్టర్ సుకుమార్ కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే బాగా వ‌ర్క్ చేస్తున్నాడు.

బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పుష్ప‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్,సాంగ్ ఇంకా పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హైప్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది. ఇక రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక ..పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

రష్మిక మంద‌న్న‌ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఇక పుష్ప గురించి వ‌స్తోన్న వార్త‌లు ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి, బ‌న్నీ రోల్ గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పుష్ప‌లో ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా క‌నిపిస్తుండ‌గా… బ‌న్నీ కూడా ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది.

గిరిజ‌న విలేజ్‌కు సంబంధించిన బ్యాక్ డ్రాప్ కావ‌డంతో ఆ వాతావ‌ర‌ణం ఉండేలా సెట్టింగులు, ప్ర‌జ‌లు, వారి వేష , భాష‌లు ఇలా అన్నింటిమీదా సుకుమార్ బాగా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. బన్నీ మాత్రం పుష్ప రాజ్ రోల్ లో సరికొత్త పెర్ఫామెన్స్ అదరగొట్టడం క‌న్ ఫార్మ్ అని అంటున్నారు. ఇక హీరోయిన్ రష్మిక కి సంబంధించిన ఒక పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తామని , చిత్ర యూనిట్ తెలపడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news