Moviesవామ్మో.. పాప మంచి స్పీడ్ మీద ఉన్నట్లుందే..కోరికలు బాగానే ఉన్నాయి..!!

వామ్మో.. పాప మంచి స్పీడ్ మీద ఉన్నట్లుందే..కోరికలు బాగానే ఉన్నాయి..!!

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇక కృతి పాప.. నాని సరసన శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్‌గా ఆఫర్‌ కొట్టెసింది. అలాగే లిగుస్వామి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో రాబోతోన్న ఉస్తాద్‌ మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి.

ఇక ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందండోయ్. తాజాగా కృతిశెట్టి..తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ఉన్నది ఉన్నట్లు.. మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్ గా చెప్పేసింది. తనకి తన సినిమాలో తానే సొంతగా డబ్బింగ్ చెప్పాలని ఉందట. ఈ కోరికను ఒప్పుకొని ఆమెచేత డబ్బింగ్ చెప్పించేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటి. అలాగే తన మొదటి సినిమా ఉప్పెన ను హిట్ చేసినందుకు బోలెడంత ధ్యాంక్స్ అని చెప్పింది ఈ మెగా ముద్దుగుమ్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news