Moviesరాజీవ్ కనకాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి.. వింటే...

రాజీవ్ కనకాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి.. వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!!

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. తెలుగు తెరపై నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి ప్రత్యేకత సాధించుకున్నారు నటి అన్నపూర్ణ. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో తన నటనతో ఎంతో మంది చేత కన్నీళ్లు పెట్టించారు. అయితే తాజాగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటకు చెప్పేశారు.

‘స్వర్గం నరకం’ అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు వారందరికి సుపరిచితం అయ్యారు. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవలె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేవదాస్ కనకాల ఓ ల్యాండ్ అమ్మారని, దాని గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేయకుండా కొనడం నా తప్పే అని అన్నపూర్ణ అన్నారు. ఇక ఆ ల్యాండ్ విషయం సెటిల్ చేయమని రాజీవ్ కనకాలను అడిగి అడిగి విసుగొచ్చిందని, నా నంబర్ కూడా బ్లాక్‌లో పెట్టేశారని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అపురూపంగా పెంచుకున్నానని, అయితే ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలిసి షాక్‌కి గురయ్యానని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news