Moviesఏందిరా అయ్యా ఇది..అందమైన హీరోయిన్స్ కు ఇంత క్రూరమైన భర్తలా..??

ఏందిరా అయ్యా ఇది..అందమైన హీరోయిన్స్ కు ఇంత క్రూరమైన భర్తలా..??

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో,హీరోయిన్ ఎంత ముఖ్యమో..విలన్ కూడా అంతే ముఖ్యం. విలన్ ఉంటేనే ఏ హీరోకైనా స్టార్ ఇమేజ్ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. విలన్ ఎంత బాగా పర్ఫామెన్స్ చేస్తే, హీరో అంత హైలెట్ అవుతాడు. మన టాలీవుడ్ లో విలన్ లు ఎంత బాగా చేస్తారో బాగా తెలుసు. అయితే ఈ స్టార్ విలన్ ల భార్యలు కూడా టాప్ హీరోయిన్ లని చాలా మందికి తెలియదు.


తెలుగు సినిమాల్లో నటించే విలన్స్ మన అందరికీ తెలుసు కానీ వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబం వివరాలు అయితే చాలా వరకు బయటికి రావు. టాలీవుడ్ లో విలన్ పాత్రలో నటించే కొంతమంది నటుల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మురళి శర్మ – అశ్విని : విలన్ గా మంచి పేరు పొందిన మురళీశర్మ , ఇక ఈయన భార్య అశ్విని కూడా బుల్లితెరపై టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో బద్రీనాథ్ సినిమాలో విలన్ గా నటించారు. హిందీలో కూడా ఎన్నో చిత్రాల్లో సీరియల్స్ లో నటించారు.

రఘువరన్ – రోహిణి : సినీ ఇండస్ట్రీలో రఘువరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ విలన్ గానే మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేసిన ఈయన మలయాళం, తమిళ భాషా చిత్రాలలో కూడా నటించి, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈయన భార్య.. ఎవరో కాదు ప్రముఖ రైటర్ గా , దర్శకురాలిగా, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన రోహిణి.

రోహిణి కూడా అలా మొదలైంది, ఇష్క్, రంగస్థలం, బాహుబలి, అల వైకుంఠపురం లో ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా గీతాంజలి సినిమాలో గిరిజ పాత్రకు, శివ సినిమాలో అమల పాత్రకు,తెలుగు యువ లో మీరాజాస్మిన్ పాత్రకు, అర్జున్ సినిమాలో కీర్తి రెడ్డి పాత్రకుఇంకా ఎన్నో తమిళ్ సినిమాల్లో కూడా హీరోయిన్ల కి డబ్బింగ్ కూడా చెప్పారు.దాదాపు 70 చిత్రాలకుపైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తరుణ్ అరోరా – అంజలా జవేరి: ఖైదీ నెంబర్ 150 లో విలన్ గా నటించారు తరుణ్ అరోరా. ఇక ఈయన భార్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంజలా జవేరి చూడాలని ఉంది, రావోయి చందమామ,సమరసింహా రెడ్డి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలతో తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు.

అశుతోష్ రాణా – రేణుకా సహాని : వెంకీ, తడాఖా, పటాస్ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు అశుతోష్ రాణా. ఆయన భార్య రేణుకా సహాని కూడా హిందీలో చాలా సినిమాల్లో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news