Moviesఈ హీరో భార్య అందం ముందు హీరోయిన్స్ బలాదూర్..!!

ఈ హీరో భార్య అందం ముందు హీరోయిన్స్ బలాదూర్..!!

సుమన్.. నిన్నటితరం అందాల నటుడు. టాలీవుడ్ హీరో సుమన్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇతనే. తమిళ్‌లో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న హీరో సుమన్‌‌ని.. తన మిత్రుడు భాను చందర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకుని వచ్చారు అప్పట్లో. అయితే హీరో సుమన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సుమన్ కూడా ఊహించని స్థాయిలో తెలుగు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. అన్ని భాషలలో కలిపి ఆయన దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు. మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉండటంతో అతన్ని యాక్షన్ హీరోగానే కాకుండా.. అసలు సిసలు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ సుమన్‌లో ఉండటంతో ఆయన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరో గుర్తింపు సంపాదించుకున్నారు.

హీరో సుమన్‌ది ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలక్రిష్ణ, నాగార్జున లాంటి హీరోలను ధీటుగా ఎదుర్కొని తన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన కెరియర్ పీక్స్‌లో ఉన్న సందర్భంలో అనూహ్య పరిస్థితుల మధ్య సుమన్‌కు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే కొంతమంది స్టార్ హీరోలు కావాలనే సుమన్‌ని తొక్కేశారని ఆయన్ని కేసులో ఇరికించారనే ప్రచారం కూడా నేటికి ఉంది.

కాని ఆయనపై బ్లూ ఫిల్మ్ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనపై పెట్టిన కేసు మాత్రం వేరు. సుమన్‌పై ఏకంగా గూంఢా యాక్ట్ పెట్టారు. ఈ ఇష్యూలో ఓ స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపించినా ఆరోపణల్ని బలపరిచే ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్ గానే మిలిగిపోయాయి. అయితే ఆ తరువాత పరిణామాలతో హీరో సుమన్.. అన్నమయ్య లాంటి చిత్రాల్లో నటించి తన సత్తా చాటినప్పటికీ అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇక సుమన్..కారు దిద్దిన కాపురం వంటి సినిమాలు రచించిన ప్రముఖ రచయిత డివి నరసరాజు మనవరాలు అయినా శిరీష తో వివాహం జరిగింది. ఈ పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం. మూడేళ్ళ పాటు జైలుకి వెళ్లి వచ్చిన సుమన్ అయన తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడం తో సినిమా ఇండస్ట్రీ ముక్కున వేలేసుకుంది. సుమన్ ఏ తప్పు చేసి ఉండదు అంటే ఆలోచన ఇండస్ట్రీలో అప్పుడే వచ్చింది.

వీరికి ఓ కూతురు కూడా ఉంది. సుమన్ వ్యక్తిగత విషయానికి వస్తే అయన కూతురు అప్పట్లో ఒక డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చి హైదరాబాద్ దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు సుమన్ శిరీషాల పెళ్లి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేయండి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news