Moviesఒక్క కిస్ సీన్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన...

ఒక్క కిస్ సీన్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ‘ధృతి’..!!

“ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌” సిరీస్ లో వచ్చిన రెండు సీజన్లకూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్-2” విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఆ తరువాత నటీనటులపై ప్రశంసలు కురిశాయి. అయితే ఇందులో మనోజ్ బాజ్ పాయ్ కూతురుగా ‘ధృతి’ పాత్రలో మెప్పించిన ఆశ్లేషా ఠాకూర్ ఈసారి హైలెట్ గా నిలిచింది. “ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌”లో మనోజ్ బాజ్‌పేయి టీనేజ్ కుమార్తెగా ధృతి పాత్రతో అష్లేషా ఠాకూర్ అందరి హృదయాలను దోచుకున్నారు.

“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ఆమె పరిణతి చెందిన నటనతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అభయ్ వర్మతో ఆమె ముద్దు సన్నివేశం ఈ సిరీస్‌లో హైలైట్ అయిన సన్నివేశాలలో ఒకటి. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదని 17 ఏళ్ల టీనేజర్ చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆశ్లేషా చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్’ను మరోసారి వార్తల్లో నిలిచేలా చేశాయి.

తన ముద్దు సన్నివేశం ఎక్స్పీరియన్స్ గురించి ‘ధృతి’ వెల్లడించింది. ముద్దు సన్నివేశంలో నటించడం ఇదే మొదటిసారని, చాలా నెర్వస్ గా అన్పించిందని, కానీ దర్శకులపై తనకు నమ్మకం ఉందని అందుకే ఆ సన్నివేశాన్ని చేశానని చెప్పుకొచ్చింది. “ఆ ముద్దు సన్నివేశం సహజంగా రావాలని.. నేను లవ్ సీన్స్ ఉన్న కొన్ని వెబ్ సిరీస్ లను చూశాను. నేను నా దర్శకులను నమ్మాను. ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో దాని గురించి చింతించలేదు. ఎందుకంటే వారు కథ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అన్న విషయం నాకు తెలుసు” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

గత సిరీస్ లో చిన్నపిల్లగా నటించిన ఆశ్లేషా సీజన్-2లో మాత్రం అందరూ నోరెళ్లబెట్టేలా నటించేసింది. ఇక ఆ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ఆమెకు మెసేజ్ లు వస్తున్నాయట.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news