Moviesనాన్న పోలికలు ఎక్కడకి పోతాయి..ఇరగదీసిన అల్లు అర్హ..ఏం చేసిందో చూడండి!!

నాన్న పోలికలు ఎక్కడకి పోతాయి..ఇరగదీసిన అల్లు అర్హ..ఏం చేసిందో చూడండి!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో బన్నీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న బన్నీ, తన పర్సనల్ లైఫ్‌లో తన కూతురు అర్హాతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాడు. కాగా అర్హా తన తండ్రితో ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చాలా వీడియోల్లో చూశాం. తమ మధ్య ఉన్న బంధాన్ని బన్నీ తరుచూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

కుందనపు బొమ్మ అంటే అల్లు అర్జున్‌ గారాలపట్టి… క్యూటీ.. అర్హానే గుర్తొస్తుంది. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ అల్లరి చేస్తూ ఉండే ఈ అల్లు వారి బేబీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చేత కుందనపు బొమ్మ అని అనిపించుకుంటుంది.సోషల్ మీడియాలో సెలబ్రిటీల పిల్లలకు ఉండే క్రేజే వేరు. తమ అభిమాన తారలతో సమానంగా వారిని ప్రేమిస్తుంటారు అభిమానులు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సినీ వారసులు చాలామంది ఉన్నారు. అయితే అందులో అబ్నాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక ప్రేమగాధ “శాకుంతలం” చిత్రంలో సమంత అక్కినేని – మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో నటిస్తున్న అర్హ.. టీమ్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేస్తున్న అర్హ.. అప్పుడే స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు అందుకుంది. “ఆమె డైలాగ్స్ లన్నీ అర్థం చేసుకుని మొదటి టేక్ లోనే చెప్పేసింది. సూపర్ స్టార్ అవుతుంది. గాడ్ బ్లెస్” అని సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా అల్లు అర్హను ఫ్యూచర్ సూపర్ స్టార్ గా ప్రకటించింది. అర్హ బాబాయ్ అల్లు శిరీష్ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక అల్లు అర్జున్ సైతం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news