Moviesబిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

బిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా ఏకంగా మూడు సంవ‌త్స‌రాల పాటు షూటింగ్‌లోనే ఉంది. కొర‌టాల చిరుకు క‌థ చెప్ప‌డం… షూటింగ్ స్టార్ట్ అవ్వ‌డ‌మే లేట్ అవ్వ‌డం.. ఆ త‌ర్వాత హీరోయిన్ కోసం సంవ‌త్స‌రం పాటు వెతికి వెతికి చివ‌ర‌కు కాజల్‌ను సెట్ చేయ‌డంతోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ త‌ర్వాత కొర‌టాల తీసిన సీన్లే తీస్తుండ‌డం కూడా చిరుకు అస‌హ‌నం తెప్పించింది. చివ‌ర‌కు ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఈ సినిమాలోకి రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ను కూడా తీసుకు వ‌చ్చారు.

ఇలా ఆచార్య ఆచార్య అంటూ మూడేళ్ల టైం వేస్ట్ అయ్యింది. ఇక మ‌ధ్య‌లో రెండు సార్లు కరోనా విజృంభించ‌డంతో షూటింగ్ కూడా వాయిదా ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు ఆచార్య గురించి క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ మ‌రో 14 రోజుల్లో పూర్తి కానుంది. క్లైమాక్స్ సీన్ షూట్ చేయ‌డంతో ఆచార్య షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఇక వ‌చ్చే ద‌స‌రా కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news