Moviesసౌత్‌లో నెంబ‌ర్ వ‌న్ క్రేజీ హీరో బ‌న్నీయే... స‌ర్వేలో స్టార్ హీరోల‌కే...

సౌత్‌లో నెంబ‌ర్ వ‌న్ క్రేజీ హీరో బ‌న్నీయే… స‌ర్వేలో స్టార్ హీరోల‌కే షాక్‌

ద‌క్షిణాదిలో నెంబ‌ర్ వ‌న్ క్రేజీ హీరో ఎవ‌రు అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువుగా వినిపించే పేరు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పేరు. ఎందుకంటే సౌత్ నుంచి టాప్ వ‌సూళ్లు ద‌క్కించుకున్న మూడు టాప్ సినిమాలు ప్ర‌భాస్‌వే ఉన్నాయి. బాహుబలి 1,2 – సాహో ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ప్ర‌త్యేకంగా నిలిచాయి. అయితే ప్రభాస్ కంటే కూడా సోషల్ మీడియాలో అత్యధిక క్రేజ్ ఉన్న సౌత్ స్టార్ హీరో ఎవరు అన్న స‌ర్వేలో అల్లు అర్జున్ మిగిలిన హీరోల‌కు షాక్ ఇస్తూ నెంబ‌ర్ వ‌న్ క్రేజీ హీరోగా నిలిచాడు.

 

ఓ ప్రైవేటు సంస్థ సౌత్ నుంచి నెంబ‌ర్ క్రేజీ హీరో ఎవ‌రు ? అని నిర్వ‌హించిన స‌ర్వేలో వేలాది మంది పాల్గొని అల్లు అర్జున్‌కు ఓటేసి నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంచారు. ఆ త‌ర్వాత స్థానం ప్ర‌భాస్‌కు ద‌క్కింది. ఇక ప్ర‌స్తుతం సౌత్‌లో ఉన్న అంద‌రు హీరోల సోష‌ల్ మీడియా అక్కౌంట్స్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య ప‌రంగా చూసినా కూడా అల్లు అర్జునే నెంబ‌ర్ వ‌న్‌లో ఉంటాడు.

 

బ‌న్నీ కంటే మిగిలిన హీరోల‌కు ఎన్నో సూప‌ర్ హిట్లు వ‌చ్చినా బ‌న్నీ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో ఉండ‌డానికి కార‌ణం. మ‌నోడికి తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్నాట‌క‌, కేర‌ళ‌లో కూడా క్రేజ్ ఉంది. కేర‌ళ‌లో అయితే అక్క‌డ టాప్ హీరోల సినిమాల‌ను మించేలా బ‌న్నీ సినిమాల‌కు వ‌సూళ్లు వ‌స్తుంటాయి. దీనికి తోడు మ‌నోడి స్టైల్‌, డ్యాన్స్‌కు భాష‌ల‌కు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇవ‌న్నీ బ‌న్నీని నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో ఉంచేలా చేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news