Moviesకాళ్ల పారాణి ఆర‌క‌ముందే కాజ‌ల్ ఇంత షాక్ ఇచ్చిందే..!

కాళ్ల పారాణి ఆర‌క‌ముందే కాజ‌ల్ ఇంత షాక్ ఇచ్చిందే..!

ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవలే వివాహం చేసుకుంది. త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్‌తో ఆమె మూడు ముళ్లు వేయించుకుందో లేదో ఆమె పెళ్లి మూడ్ నుంచి అప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఆమె కాళ్ల పారాణి కూడా ఆరిందో లేదో గాని ఆమె వెంట‌నే సెట్స్‌లోకి వ‌చ్చేస్తున్నారు. పెళ్లి అయ్యాక ఎవ‌రైనా కొద్ది రోజుల పాటు హ‌నీమూన్ అంటోనో లేదా ఇత‌రత్రాతో పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఆరాట ప‌డ‌తారు. కానీ కాజ‌ల్ మాత్రం అప్పుడే షూటింగ్ కోసం సెట్స్‌లోకి వ‌చ్చేస్తోంది.

 

కాజ‌ల్ మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటు క‌మ‌ల్ భార‌తీయుడు 2 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. పెళ్ల‌యిన మూడు రోజుల‌కే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఆమెకు త‌న సినిమాల ప‌ట్ల ఎంత క‌మిట్‌మెంట్ ఉందో అని ప‌లువురు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటారు. ఆమె కోలీవుడ్‌లో ఆమె దుల్క‌ర్ స‌ల్మాన్ ప‌క్క‌న హే సినామికా సినిమాలో కూడా న‌టిస్తోంది. ఏదేమైనా కాజ‌ల్‌కు ఈ వ‌య‌స్సులో కూడా అవ‌కాశాల మీద అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news