Moviesతెలుగులో ప్లాప్ హీరోయిన్‌... అక్క‌డ క్రేజీ హీరోయిన్‌... ఎవ‌రో తెలుసా..!

తెలుగులో ప్లాప్ హీరోయిన్‌… అక్క‌డ క్రేజీ హీరోయిన్‌… ఎవ‌రో తెలుసా..!

తెలుగులో త‌కిట త‌కిట సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది క‌న్న‌డ బ్యూటీ హ‌రిప్రియ‌. తెలుగులో కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చినా అవేవి స‌క్సెస్ కాక‌పోవ‌డంతో తిరిగి మూటా ముల్లు స‌ర్దుకుని ఆమె క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు చెక్కేసింది. తెలుగులో ఆమెకు ఒక్క హిట్ లేక‌పోయినా క‌న్న‌డంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.

 

 

వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంచుకుంటోన్న హ‌రిప్రియ‌కు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో పాటు ఇప్పుడు ఆమె క‌న్నడ నాట స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. తెలుగులో హిట్ అయిన ఎవ‌రు సినిమాను క‌న్న‌డ‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హ‌రిప్రియ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే పెట్రోమ్యాక్స్‌, హ్యాపీ ఎండింగ్‌, లాగాన్ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

ఏదేమైనా తెలుగులో డిజాస్ట‌ర్ హీరోయిన్‌గా ముద్ర‌ప‌డ్డ హ‌రిప్రియ క‌న్న‌డ నాట స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొంద‌డం గ్రేటే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news