Moviesశ్రీముఖి లెగ్ పెట్టింది... బొమ్మ బెదిరింది.. జ‌గ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

శ్రీముఖి లెగ్ పెట్టింది… బొమ్మ బెదిరింది.. జ‌గ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

నాగ‌బాబు అదిరింది ముందునుంచి ప్లాపు బొమ్మే అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి మాంచి మాసాలా ద‌ట్టించి బొమ్మ అదిరింది పేరుతో వ‌దిలారు.. యాంక‌ర్ల‌ను మార్చారు. మ‌రోవైపు జ‌గ‌న్ కాంట్రవ‌ర్సీ నేప‌థ్యంలో ఈ షో భారీ రేటింగ్ తెచ్చుకుంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అస‌లు ఈ షో నుంచి ముందుగా స‌మీర‌ను పీకేశారు.. త‌ర్వాత భాను, ర‌విని తీసుకువ‌చ్చారు. వాళ్ల‌ను కూడా త‌ప్పించి శ్రీముఖిని తెచ్చారు.

 

 

కొత్త మెరుగుల‌తో బొమ్మ అదిరింది అని రీ లాంచ్ చేశారు. ఈ సారి బార్క్ హైద‌రాబాద్ రేటింగ్స్‌లో టాప్ 161వ ప్లేసు. చివ‌ర‌కు 3.75 రేటింగ్స్‌తో స‌రి పెట్టుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ వేటు యాంక‌ర్ శ్రీముఖిపైనేనా.. ఆమెను కూడా త‌ప్పించేస్తారా ? అన్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఆమె లెగ్గు పెట్టిందో లేదో ఇక్క‌డ షో ఢ‌మాల్ అంద‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్నాయి.

 

జ‌బ‌ర్ద‌స్త్ షో స‌క్సెస్ చేసిన డైరెక్ట‌ర్లే ఇక్క‌డ‌కూ వ‌చ్చారు.. మ‌రి రిజ‌ల్ట్ ఏంటి ఇంత దారుణంగా తేడా కొట్టేస్తోంది అన్న‌ది నాగ‌బాబు ఆలోచించుకుంటాడా ? అన్న‌ది చూడాలి. ఇక ఇప్పుడు ఈ షో ప్లాప్ రేటింగుతో జ‌గ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news