Moviesసోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న సితార ఉంగరం సీక్రెట్స్ ఇవే

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న సితార ఉంగరం సీక్రెట్స్ ఇవే

సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కుమారుడు గౌత‌మ్‌, కుమార్తె సితార ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గౌత‌మ్ కంటే కూడా సితార ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సితార పోస్టులు, వీడియోల‌కు దుమ్ము రేపే రెస్పాన్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఉంటుంది.

 

ఓ సారి మ‌హేష్‌ను సైతం సితార‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడ‌ప‌ల్లి కుమార్తె క‌లిసి ఇంట‌ర్వ్యూ  చేశారు. ఈ ఇంట‌ర్వ్యూ పెద్ద సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక సితార‌, గౌత‌మ్ ఫొటోల‌ను న‌మ్ర‌త కూడా ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇన్ స్టాలో సితార షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఉంగ‌రం వెన‌క క‌థ గురించి చెపుతూ సితార ఈ సారి దీపావ‌ళి గిఫ్ట్ ముందే వ‌చ్చింది.

 

ఈ ఉంగరం మా అమ్మకు ఎనిమిదేళ్లు ఉన్న‌ప్పుడు వాళ్ల అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఇది అని పెట్టింది. మా అమ్మ‌మ్మ అమ్మ‌కు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు నాకు గిఫ్ట్ అయ్యింద‌ని సితార మురిసిపోతోంది. అది సితార ఉంగ‌రం సీక్రెట‌స్స్‌. ఇప్పుడు ఈ ఉంగ‌రం స్టోరీ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news