Moviesర‌వితేజ క్రాక్ మేకింగ్ వీడియో... లాస్ట్ పంచ్ కుమ్మేసింది.. ( వీడియో)

ర‌వితేజ క్రాక్ మేకింగ్ వీడియో… లాస్ట్ పంచ్ కుమ్మేసింది.. ( వీడియో)

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ సినిమాలో న‌టిస్తున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ గ్యాప్ వ‌చ్చాక ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం క్రాక్ మూవీ చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నెగిటివ్ రోల్లో న‌టిస్తోంది. గ‌తంలో శృతీహాస‌న్  – ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన బ‌లుపు సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కూడా మ‌లినేని గోపీచందే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

 

ఇప్ప‌టికే రిలీజ్ అయిన క్రాక్ టీజ‌ర్ ప్రేక్ష‌కులు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ షూటింగ్ జ‌రుగుతోన్న వీడియోను వ‌దిలారు. హీరో ర‌వితేజ‌, ద‌ర్శ‌కుడు గోపీచంద్‌తో పాటు సినిమాలో నటిస్తోన్న ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా వ‌ల్ల శానిటైజేష‌న్, మాస్క్‌లు ధ‌రించి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. షూటింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది.

 

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని లాంటి న‌టుల‌తో పాటు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కుడు కావ‌డంత ఈ సారి క్రాక్‌తో ర‌వితేజ ఖ‌చ్చితంగా హిట్ కొడ‌తాడ‌నే అంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోన్న ఈ మేకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news