Moviesవెంట్రుక కూడా పీక‌లేరు... వైసీపీ ఫ్యాన్స్‌కు మంట పెట్టిన నాగ‌బాబు

వెంట్రుక కూడా పీక‌లేరు… వైసీపీ ఫ్యాన్స్‌కు మంట పెట్టిన నాగ‌బాబు

జీ తెలుగులో ప్ర‌సారం అవుతోన్న బొమ్మ అదిరింది షో రాజ‌కీయ వివాదాల‌కు నిల‌యంగా మారింది. అదిరింది పేరు మార్చి బొమ్మ అదిరిందిగా ప్ర‌సారం చేయ‌గా.. తొలి ఎపిసోడ్‌పైనే కావాల్సినంత వివాదం చెల‌రేగింది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల పేర‌డీల‌తో క్రికెట్ ఆడించారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మ‌రుగుజ్జు రియాజ్ ఇమిటేట్ చేస్తూ అన్న వ‌చ్చాడ‌ని హేళ‌న చేశాడు. అయితే ఇది ప‌రిధి దాటి హేళ‌న చేసిన‌ట్టుగా ఉంది. రాజ‌శేఖ‌ర్‌, బాల‌య్య‌, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి హీరోల‌తో పాటు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబును కూడా ఇమిటేట్ చేసినా చిరు, ప‌వ‌న్‌ను చేయ‌లేదు.

 

సద్దాం రాజశేఖర్‌ని ఇమిటేట్ చేస్తూ చేసిన కామెడీ అయితే మరీ దారుణంగా హేళనగా ఉంది. ఇక జ‌గ‌న్‌ను ఇమిటేట్ చేసిన రియాజ్‌కు వైసీపీ వాళ్ల నుంచి బెదిరింపులు వెళ్ల‌డంతో మ‌నోడు చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. మరోసారి ఇలా చేయమని జగన్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు రియాజ్, హరి. అయితే వైసీపీ వాళ్లు జ‌డ్జిగా ఉన్న నాగ‌బాబును విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. నాగ‌బాబు త‌న‌ను ట్రోల్ చేస్తోన్న వాళ్ల‌కు ఘాటుగా రిప్లే ఇచ్చాడు.

 

సింహాస‌నంపై కుక్కును కూర్చోపెట్టి ఈ ఫొటోకు బొమ్మ అదిరింద‌ని క్యాప్ష‌న్ ఇచ్చి వైసీపీ వాళ్ల‌కు మ‌రింత మంట పెట్టేలా చేశాడు. నాగబాబు విగ్‌ని కామెంట్ చేస్తూ రాయల్ హెయిర్ ఆయిల్ అంటూ ఒక పోస్టర్ వైరల్ అయ్యింది. దీనికి కౌంట‌ర్‌గా నాగ‌బాబు బ్ర‌ద‌ర్ ఎడిట‌ర్‌గా నీ ఫ్యూచ‌ర్ బ్రైట్‌గా క‌నిపిస్తోంది. బ‌ట్ బ్యాడ్ ల‌క్ నేను ఇంకా ఇన్ప్లూ ఎన్స‌ర్ మార్కెటింగ్‌లోకి రాలేదు.. బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైం అని కౌంట‌ర్ ఇచ్చాడు.

 

ఆ పోస్ట‌ర్‌లో నాగ‌బాబు మీసం మెలేస్తుంటే ఒక్క వెంట్రుక కూడా  పీక‌లేరు అని ఉంది. ఇప్పుడు ఈ రెండు పోస్ట‌ర్లు వైసీపీ ఫ్యాన్స్‌కు, జ‌గ‌న్ వీరాభిమానుల‌కు మ‌రింత‌గా మంట పెట్టించేస్తున్నాయి. జ‌న‌సైనికులు మాత్రం నాగ‌బాబుకు స‌పోర్టుగా పోస్టులు పెడుతూ మీకు మేం అడంగా ఉంటాం అని చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news