Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ పేరుతో దారుణమైన మోసం

విజ‌య్ దేవ‌ర‌కొండ పేరుతో దారుణమైన మోసం

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పి కొన్ని సంస్థ‌లు త‌ప్పుడు అడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నాయ‌ని విజ‌య్ పీఆర్ టీం గుర్తించింది. విజ‌య్ సినిమా ఏదైనా ఉంటే తాము అధికారికంగానే ప్ర‌క‌టిస్తామ‌ని… వాటిని విజ‌య్ స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారానే చెపుతార‌ని.. ఆయ‌న పేరుతో త‌ప్పుడు అడిష‌న్లు చేసేవారిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కూడా విజ‌య్ టీం స్ప‌ష్టం చేసింది. దీనిపై టీం మాట్లాడుతూ కొంద‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా తీస్తామంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ.. అడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నాయ‌ని..  విజ‌య్ సినిమాలు అన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా ఖాతాల నుంచే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని.. ఎవ‌రైనా విజ‌య్ పేరుతో త‌ప్పుడు అడిషన్లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విజ‌య్ టీం చెప్పింది.

 

 

కొద్ది రోజులుగా విజ‌య్ సినిమాలో ఛాన్స్ అంటూ కొంద‌రు ఫేక్ అడిష‌న్ల‌తో మోసాలు చేస్తున్నారు. ఈ దారుణ‌మైన మోసం విజ‌య్ టీం దృష్టికి వెళ్ల‌డంతోనే వారు స్పందించారు. ఇక విజ‌య్ ఈ యేడాది వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ నటిస్తోన్న ఫైట‌ర్ షూటింగ్‌లో ఉంది. ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. ఇక విజ‌య్ న‌టిస్తోన్న హీరో షూటింగ్ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news