ఎన్‌సీబీ ముందు రియా డ్రామాలు… ఏం గేమ్ ప్లే చేసిందో తెలిస్తే మైండ్ పోవాల్సిందే..

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ, ఎన్‌సీబీ విచార‌ణ‌లో అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇక ఎన్‌సీబీ విచార‌ణ‌లో రియా చాలా గేమ్ ప్లే చేసింద‌ని.. చాలా తెలివిగా స్కెచ్ గీసింద‌ని ఆమె మాట‌ల ద్వారా తెలుస్తోంది. తాను డ్ర‌గ్స్ కొన్న మాట నిజ‌మే అయినా… తాను ఎప్పుడూ వాటిని వాడ‌లేద‌ని.. సుశాంత్ కోసమే తాను వాటిని వాడాన‌ని చెప్పింది. ఈ యేడాది మార్చి 17న జైద్ నుంచి డ్ర‌గ్స్ కొనేందుకు మేనేజ‌ర్ మిరిండా కూడా వెళ్లిన విష‌యం రియా ఎన్‌సీబీ ముందు ఒప్పుకుంది. మార్చి 15న తన సోదరుడు షోవిక్‌కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్‌ చాట్ నిజం అని ఆమె చెప్పింది.

A big reveal about Riya Chakraborty's birthday was given by Sushant | News  Track Live, NewsTrack English 1

ఇక డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో రియాకు ఉన్న లింకుల‌పై విచారించేందుకు ఆదివారం ఆమెపై అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇక రియా సైతం సుశాంత్ మృతి త‌ర్వాత తాను ఎప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని చెప్పారు. సుశాంత్‌ సింగ్‌ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్‌సీబీ తెలిపింది. షోవిక్‌ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్‌ని సరఫరా చేసేవాడని ఎన్‌సీబీ వెల్లడించింది. ఏప్రిల్‌ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్‌ సేకరించినట్లు దీపేశ్‌ ఎన్‌సీబీకి వెల్లడించారు. ఏదేమైనా రియా చాలా తెలివిగా డ్ర‌గ్స్ ఇష్యూను సుశాంత్‌పైకి నెట్టేసేలా స్కెచ్ గీసింద‌ని ఆమె మాట‌లే చెపుతున్నాయి.

Leave a comment