Politicsపత్తి పంటకు శ్రీరామరక్ష సూపర్ లావా కాటన్

పత్తి పంటకు శ్రీరామరక్ష సూపర్ లావా కాటన్

– మార్కెట్ లోకినోవా అగ్రిటెక్ వారినూతన ప్రోడక్ట్
– ఆవిష్కరించిన నోవా అగ్రిటెక్ ఎండి కిరణ్ కుమార్, డైరక్టర్ బసంత్

పత్తి పంటను పురుగుల నుంచి కాపాడి, రైతు ఇంట సిరులు కురిపించేందు అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో నోవా అగ్రిటెక్ నూతన ప్రోడక్ట్ సూపర్ లావా కాటన్ ను రైతుల ముంగిటకు తీసుకు వచ్చిందని నోవా అగ్రిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఏటూకూరి కిరణ్ కుమార్ అన్నారు. మేడ్చ‌ల్‌లోని  నోవా అగ్రిటెక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ బసంత్ తో కలసి ఆయన నూతనంగా తమ సంస్థ రూపొందించిన  సూపర్ లావాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోవా అగ్రిటెక్ ఎల్లప్పుడూ రైతుల సేవలో  ఉంటుందన్నారు.

 

 

సూపర్ లావా కాటన్ పత్తి పంట నాటిన 90 రోజుల తర్వాత పత్తి పంటను ఆశించే తెల్లదోమ, పచ్చ దోమ, పేనుబంక, తామర పురుగు, నల్లి, పిండినల్లి,వంటి రసం పీల్చు పురుగులను నాశనం చేస్తుందన్నారు. పచ్చ పురుగు, లద్దెపురుగు, గులాబి రంగు పురుగులను సమర్ధవంతంగా అరికడుతుందని ఆయన వివరించారు. అలాగే అన్నదాతల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాయ సైజును అధికం చేసి పూత, కాతను పెంపొందించేందుకు తోడ్పాడుతుందన్నారు.

 

సకాలంలో చీడ పీడలను నివారించడం, తేజోవంతమైన మొక్క పెరుగుదలకు, అధిక నాణ్యమైన దిగుబడులు అందించేందుకు సూపర్ లావా పనిచేస్తుందన్నారు. రైతన్నలకు అండగా నోవా అగ్రిటెక్ ఉంటుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆదరణ కు అనుగుణంగా అనేక ఉత్పత్తులను అందించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news