Moviesబ్రేకింగ్‌: ఎస్పీ. బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్‌... గుడ్ న్యూస్‌

బ్రేకింగ్‌: ఎస్పీ. బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్‌… గుడ్ న్యూస్‌

కరోనా వైరస్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్ర‌మ‌క్ర‌మంగా మెరుగ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనాతో చెన్నై ఎంజీఎం హాస్ప‌టల్లో చికిత్స పొందుతోన్న బాలు ఆరోగ్యం ప్రారంభంలో తీవ్ర విష‌మంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక గ‌త ప‌ది రోజుల నుంచి బాలు ఆరోగ్యం క్ర‌మ‌క్ర‌మంగా మెరుగ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే బాలు ఆరోగ్యంపై తాజాగా ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు.

 

ప్ర‌స్తుతం బాలు ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. ఫిజియోథెర‌పీ కొన‌సాగుతోంద‌ని చ‌ర‌ణ్ తెలిపాడు. ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స చేస్తున్నార‌ని.. త‌న తండ్రికి వైద్య సేవ‌లు అందిస్తోన్న ఎంజీఎం ఆసుప‌త్రి వైద్య సిబ్బందితో పాటు త‌న తండ్రి కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్న వారందరికీ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆగ‌స్టు 5 నుంచి కూడా బాలు ఎంజీఎం ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక బాలుకు క‌రోనా నెగిటివ్ కూడా వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news