Moviesమెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌...?

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌…?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. క‌రోనా కేసుల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ ప‌డుతున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా ఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినిమా వాళ్ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టీమ‌ణులు క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

 

నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ అని రావ‌డంతో ఆయ‌న క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడ‌ని అంటున్నారు. నాగ‌బాబు ప‌లు తెలుగు టెలివిజ‌న్ షోల‌కు హోస్ట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌లే ఆయ‌న త‌న కుమార్తె నిహారిక‌ను ఓ ఇంట‌ర్వ్యూ కూడా చేశాడు. ఈ షూటింగ్‌ల స‌మ‌యంలోనే ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిందంటున్నారు. అయితే నాగ‌బాబుకు క‌రోనా వ‌చ్చిన విష‌యం అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news