Moviesకీర్తి సురేష్ తొలి తెలుగు సినిమా వెన‌క టాప్ సీక్రెట్... ఇన్నాళ్ల‌కు...

కీర్తి సురేష్ తొలి తెలుగు సినిమా వెన‌క టాప్ సీక్రెట్… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట ప‌డింది..

కీర్తి సురేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసినంత వ‌ర‌కు ఆమె తొలి తెలుగు సినిమా నేను శైల‌జ‌. 2016 లో రామ్ సరసన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు తొలి సినిమా శైల‌జ కాద‌ట‌. ఆమె బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌నప్పుడే ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా టైటిల్ ఐనా ఇష్టం నువ్వు. ఈ సినిమాతోనే సీనియర్ నరేష్ వారసుడు నవీన్ కృష్ణ హీరోగా పరిచయం కావాల్సింది. సీనియ‌ర్ నిర్మాత చంటి అడ్డాల నిర్మాత‌గా ఈ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫ‌ర్ రామ్ ప్ర‌సాద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

వివాదాల్లో ఉండ‌డంతో ఈ సినిమా ఇప్ప‌ట‌కీ రిలీజ్ కాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు టైటిల్ మార్చి జానకి నేను పేరుతో ఆ మూవీని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా అక్టోబ‌ర్‌లో ఓటీటీలోరి రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమను వెంటాడుతోన్న వివాదాలు ఇంకా కొలిక్కి రాలేదు. చంటి అడ్డాల నుంచి ఈ సినిమా రైట్స్ తాను కొన్నాన‌ని.. న‌ట్టికుమార్ వాదిస్తున్నాడ‌ట‌. ఇందుకు త‌న వ‌ద్ద ఆధారాలు కూడా ఉన్నాయ‌ని న‌ట్టి చెపుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌.

ఏదేమైనా కీర్తి ఎవ‌రో తెలియ‌న‌ప్పుడు ప్రారంభ‌మైన ఈ సినిమా సీక్రెట్ మొత్తానికి అలా మ‌రుగున ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news