Politicsటీడీపీ చేతిలో ఏపీ మంత్రి.. తెలంగాణ మ‌హిళా నేత లీల‌లు...!

టీడీపీ చేతిలో ఏపీ మంత్రి.. తెలంగాణ మ‌హిళా నేత లీల‌లు…!

గ‌త యేడాది ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 సీట్ల‌తో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. ఆ వెంట‌నే సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబంతో స‌హా ఐదు రోజులు టూర్‌కు వెళ్లారు. అదే స‌మ‌యంలో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఫుల్ జోష్‌తో ఎవ‌రేం చేసినా పట్టించుకోరు… ప్ర‌తిప‌క్ష టీడీపీ వాళ్లు మైండ్ బ్లాక్ అయ్యి షాక్‌లో ఉన్నార‌ని విచ్చ‌ల‌విడిగా పార్టీలు చేసుకుంటే.. మ‌రి కొంద‌రు తాము కూడా విదేశీ టూర్ల‌కు వెళ్లారు. ఇది పట్టించుకోవాల్సిన విష‌యం కాక‌పోయినా ఏపీకి చెందిన ఓ మంత్రి మాత్రం తెలంగాణ‌కు చెందిన ఓ మ‌హిళా నేత‌తో క‌లిసి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లార‌ట‌.

 

అక్క‌డ ఆ మంత్రి ఆ మ‌హిళా నేత‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగార‌ట‌. అయితే ఇప్పుడు  ఆ వీడియో టీడీపీ చేతికి చిక్క‌డంతో దానిని వైరల్ చేయించాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంద‌ట‌. అయితే ఆ వీడియో ఇప్పుడే బ‌య‌ట పెట్టాలా ?  లేదా అద‌ను చూసి స‌రైన టైంలో బ‌య‌ట‌కు తీయాలా ? అని టీడీపీ భావిస్తోంద‌ని టీడీపీలోని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. బ్యాంకాక్ వీధుల్లో ఆ మ‌హిళా నేత‌తో స‌ద‌రు మంత్రి తిరుగుతున్న‌ట్టు ఆ వీడియోలో ప‌క్కాగా ఉంద‌నే అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో టీడీపీలోని టాప్ లీడ‌ర్ల గ్రూపుల్లో వైర‌ల్ అవుతోంద‌ట‌.

 

అయితే ఈ మంత్రి అక్క‌డ‌కు వెళ్లిన‌ప్పుడు స‌ద‌రు మ‌హిళా నేత కూడా అనుకోకుండా వ‌చ్చారా ?  ఇది కామ‌న్‌గా జ‌రిగిందా ? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌స్తే స‌ద‌రు మంత్రి ప‌ని మాత్రం అయిపోయిన‌ట్టే అంటున్నారు. ఇక ఆ మంత్రి అంటే ప‌డ‌ని కొంద‌రు వైసీపీ నేతలు కూడా ఈ వీడియో కోసం ట్రై చేస్తున్నార‌ట‌. అయితే ఇది ఎప్పుడు బ‌య‌ట పెడ‌తారు ? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్‌గా ఉంద‌ట‌. దీనిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి పెద్ద దుమారం రేపాల‌ని టీడీపీ చూస్తోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news