Moviesఅక్కినేని నాగ‌చైత‌న్య‌కు అన్న‌య్య ఉన్నాడు తెలుసా....

అక్కినేని నాగ‌చైత‌న్య‌కు అన్న‌య్య ఉన్నాడు తెలుసా….

అక్కినేని నాగార్జున‌కు వార‌సుడు నాగ‌చైత‌న్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ప్రేక్ష‌కుల మ‌నస్సులు గెలుచుకున్నాడు. ఇక స్టార్ హీరోయిన్ స‌మంత‌ను పెళ్లి చేసుకున్నాడు. చైతు నాగార్జున – వెంక‌టేష్‌, సురేష్‌బాబు సోద‌రి శ్రీల‌క్ష్మి సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున – శ్రీల‌క్ష్మి మ‌ధ్య విబేధాలు వ‌చ్చి విడిపోయారు. త‌ర్వాత నాగార్జున అమ‌ల‌ను పెళ్లి చేసుకోగా, శ్రీ ల‌క్ష్మి అమెరికాకు చెందిన శ‌ర‌త్ విజ‌య్ రాఘ‌వ‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌కు కూడా ఇది రెండో పెళ్లి.

అక్కినేని నాగచైతన్య అన్నయ్య గురించి మీకు తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

శ‌ర‌త్ త‌మిళ‌నాడుకు చెందిన వారు. ఇక చైతు బాల్య‌మంతా త‌ల్లి ద‌గ్గ‌రే గడిచింది. అటు శ‌ర‌త్ మొద‌టి భార్య కుమారుడు కూడా శ్రీల‌క్ష్మి ద‌గ్గ‌రే గ‌డ‌వ‌డంతో చైతు, శ‌రత్ తొలి భార్య కుమారుడు కూడా క‌లిసే పెరిగారు. అలా చైతుకు శ‌ర‌త్ తొలి భార్య కొడుకు అన్నే అవుతాడు. చైతు అన్న‌న మంచి బిజినెస్‌మేన్‌గా స్థిర‌ప‌డ్డాడు. కొద్ది రోజుల క్రితం చైతు అన్న వివాహం జ‌ర‌గ‌గా ఈ వేడుక‌కు చైతు, స‌మంత హాజ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

 

అలా బాల్యంలో త‌న అన్న‌తో పెరిగిన అనుబంధాన్ని చైతు ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఇక చైతు కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ల‌వ్ స్టోరీ సినిమాలో న‌టిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news