Gossipsత‌మ‌న్నా షాకింగ్ డెసిష‌న్‌.... ఆ హీరోల‌కు పెద్ద షాక్ ఇచ్చిందే...!

త‌మ‌న్నా షాకింగ్ డెసిష‌న్‌…. ఆ హీరోల‌కు పెద్ద షాక్ ఇచ్చిందే…!

త‌మ‌న్నా ఇప్ప‌టికే మూడున్న ప‌దుల వ‌య‌స్సుకు చేరువైంది. యంగ్ హీరోలు ఆమె వైపే చేడ‌డం లేదు. ఆమెకు చివ‌రిగా వ‌చ్చిన మంచి ఛాన్స్ ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డిలో చేసిన రోల్ మాత్ర‌మే. ఇక ఇప్పుడు ఛాన్సులు లేక ఆమె చివ‌ర‌కు స‌త్య‌దేవ్ లాంటి హీరోల ప‌క్క‌న ఛాన్సులు వ‌చ్చినా కూడా ఓకే చెప్పేస్తోంది. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమెకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వ‌రూ ఛాన్స్ ఇచ్చే సాహ‌సం కూడా చేయ‌రు.

ఇప్ప‌టికే ఆమె చిరంజీవితో పాటు వెంక‌టేష్ ప‌క్క‌న ఎఫ్ 2 సినిమాలో చేసింది. ఇస్తే గిస్తే ఆమె సీనియ‌ర్ హీరోలు మాత్ర‌మే ఛాన్సులు ఇవ్వాలి.. కుర్ర హీరోలు మాత్రం ఆమె వైపు చూసే ప‌రిస్థితి లేదు. వ‌రుస‌గా సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టిస్తే ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డు ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే కుర్ర హీరోలు ఛాన్సులు ఇవ్వ‌డం లేదు.. అందుకే ఆమె చిన్న హీరో అయినా కూడా కుర్ర హీరో అయిన స‌త్య‌దేవ్ ప‌క్క‌న న‌టించేందుకు ఒప్పుకుంద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇలా కుర్ర హీరోల ప‌క్క‌న న‌టిస్తే మ‌రి కొన్ని సినిమాల్లో అయినా ఛాన్సులు వ‌స్తాయ‌న్న‌దే ఆమె ప్లాన్‌. ఏదేమైనా కెరీర్ స్లంప్‌లో ప‌డిపోవ‌డంతో ఇప్పుడు ఆమె షాకింగ్ డెసిష‌నే తీసుకుంది. అయితే ఆమె నిర్ణ‌యం సీనియ‌ర్ హీరోల‌కు పెద్ద షాకే.. త‌మ‌న్నా త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మంచి ఆప్ష‌న్‌గా ఉంద‌నుకున్న సీనియ‌ర్లు ఇప్పుడు మ‌రో హీరోయిన్‌ను వెతుక్కోవాలి. అస‌లే సీనియ‌ర్ హీరోలు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ఇప్పుడు త‌మ‌న్నా కూడా వారి ప‌క్క‌న న‌టించేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో అస‌లు ఈ సీనియ‌ర్ హీరోల‌కు చివ‌ర‌కు ఏ హీరోయిన్లు సెట్ అవుతారో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news