Gossipsజ‌బ‌ర్ద‌స్త్ షాక్‌.... ష‌క‌ల‌క శంక‌ర్ గుడ్ బై

జ‌బ‌ర్ద‌స్త్ షాక్‌…. ష‌క‌ల‌క శంక‌ర్ గుడ్ బై

జ‌బ‌ర్ద‌స్త్ ఫ్యాన్స్‌కు జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షాక్ త‌గ‌ల‌నుంది. ఈ షో నుంచి ఓ ఫేమ‌స్ కంటెస్టెంట్ అవుట్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ష‌క‌ల‌క శంక‌ర్ పాపుల‌ర్ అయ్యిందే జ‌బ‌ర్ద‌స్త్ షోలో.. ఆ త‌ర్వాత మ‌నోడు సినిమాల్లో బిజీ అయ్యాక ఇక్క‌డ షోలు త‌గ్గించాడు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ నుంచి నాగ‌బాబు త‌ప్పుకున్నాక ఇక్క‌డ అనేకానేక మార్పులు జ‌రుగుతున్నాయి. ఈ మార్పుల్లోనే శంక‌ర్ జ‌బ‌ర్ద‌స్త్ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ షోకు గుడ్ బై చెప్పేస్తున్నాడ‌ట‌.

కొన్ని అసంతృప్తుల వ‌ల్లే శంక‌ర్ ఇక్క‌డ నుంచి త‌ప్పుకుంటున్నాడ‌న్న గుస‌గుస‌లు కూడా లీక్ అయ్యాయి. రీ ఎంట్రీ ఇచ్చాక ఇక్క‌డ ప‌ది ఎపిసోడ్‌ల వ‌ర‌కు శంక‌ర్ చేశాడు. అయితే త‌న స్కిట్‌ను ఎపిసోడ్‌లో లాస్ట్ స్కిట్‌గా వేయ‌డం అత‌డికి న‌చ్చ‌లేద‌ట‌. ఇది అసంతృప్తికి గురి చేసింద‌ని.. ఇక యూట్యూబ్‌లో సైతం త‌న స్కిట్‌ల‌కు స‌రైన రెస్సాన్స్ లేక‌పోవ‌డంతో పాటు తాను అనుకున్న రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం లేద‌ని కూడా ఫీల్ అవుతున్నాడ‌ట‌. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలేందుకు రెడీ అవుతోన్న శంక‌ర్ మ‌ళ్లీ రెండు చిన్న సినిమాల‌కు సైన్ చేసిన‌ట్టు భోగ‌ట్టా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news