Gossipsర‌వితేజ - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌పై ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌

ర‌వితేజ – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌పై ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా తెలుగులో యువ‌హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్న మాట నిజం. ఆర్ ఆర్ ఆర్ తో ఏకంగా ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ సైతం జోడీ క‌ట్టారు. ఇక ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత మ‌రి కొంత‌మంది యువ‌హీరోలు కూడా క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. వి సినిమాలో నాని, సుధీర్‌బాబు క‌లిసి న‌టించారు. ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి గోపాల గోపాల సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Pawan Kalyan New Film: పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్ ? | వినోదం News in  Telugu

ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కాంబోలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాకు సంబంధించి రెండు ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ కోలీవుడ్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నార‌ని.. ఈ సినిమాకు ప‌వ‌న్‌కు అత్యంత ఇష్టుడు అయిన గోపాల గోపాల‌, కాట‌మ‌రాయుడు డైరెక్ట‌ర్ డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి..

 

డాలీ తీసిన ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌లే. ఇప్పుడు ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేసే డాలీ మూడో సినిమాకు సైతం రీమేక్ క‌థ‌లే ఎంచుకున్నాడంటున్నారు. ఈ సినిమాను రామ్ తుళ్లూరి నిర్మిస్తార‌ని టాక్‌. ఇప్ప‌టికే ఈ ఎస్ఆర్‌టీ బ్యాన‌ర్లో ర‌వితేజ రెండు సినిమాలు చేశాడు. నేల‌టిక్కెట్టుతో పాటు డిస్కొరాజా సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. మ‌రి ఈ సినిమా అయినా క‌లిసొస్తుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news