Moviesఆ హీరోను ఢీ కొట్టే కిలాడీ లేడీ శ్రేయా... ప్రియ‌మ‌ణా..!

ఆ హీరోను ఢీ కొట్టే కిలాడీ లేడీ శ్రేయా… ప్రియ‌మ‌ణా..!

బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన అంధాధూన్ తెలుగులో రీమేక్ కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ అయిన శ్రేష్ట్ మూవీస్‌పైనే నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంతో ఈ సినిమా తెర‌కెక్కింది. విమ‌ర్శ‌కుల నుంచి బెస్ట్ క్రైం థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన అంధాధూన్ ను తెలుగు వెర్ష‌న్‌లో మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది.

Shriya Saran, husband ignore netizen's objectification quip

నితిన్ ప‌క్క‌న న‌భా న‌టేష్ హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక్క ప్ర‌శ్న వ‌స్తోంది. బాలీవుడ్‌లో ట‌బు చేసిన రోల్ తెలుగులో ఎవ‌రు చేస్తున్నార‌న్న‌దే కాస్త స‌స్పెన్స్‌గా మారింది. ఈ పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సినిమాను మలుపు తిప్పే ఈ పాత్ర‌ లేడీ విల‌న్‌గా ఉంది. ఈ పాత్ర కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర. ఈ పాత్ర‌ను తెలుగులో కూడా ముందు టబూయే చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార పేరు వినిపించింది. వీరిద్ద‌రు భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో ఇప్పుడు వీరిని ప‌క్క‌న పెట్టేశార‌ట‌.

National Award-winning actress Priyamani to star opposite Ajay Devgn in  'Maidaan' | Hindi Movie News - Times of India

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ రోల్‌కు ముదురు బ్యూటీలు శ్రియా శ‌ర‌ణ్ లేదా ప్రియ‌మ‌ణిలో ఎవ‌రో ఒక‌రిని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఫైన‌ల్‌గా ఈ కిలాడీ లేడీ రోల్‌ను ఎవ‌రు చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news