Gossipsసుధీర్‌బాబు రెమ్యున‌రేష‌న్ పెంచేశాడే... ఎన్ని కోట్లో తెలుసా...!

సుధీర్‌బాబు రెమ్యున‌రేష‌న్ పెంచేశాడే… ఎన్ని కోట్లో తెలుసా…!

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని – సుధీర్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వి సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యి ఇప్ప‌టికే సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 5న అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సుధీర్‌బాబు న‌ట‌న గురించే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ట్రైల‌ర్లో సుధీర్‌బాబు సూప‌ర్ యాక్ష‌న్ హీరోగా క‌నిపించి అంద‌రిని ఫిదా చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఇది సుధీర్‌బాబు కెరీర్‌కు మంచి ప్ల‌స్ అవుతుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి.

Sudheer Babu Height, Weight, Age, Wife, Affairs & More » StarsUnfolded

ఇప్ప‌టి వ‌ర‌కు సుధీర్‌బాబుకు నిర్మాతలు సినిమాకు రు. 2 కోట్లు ఇచ్చార‌ని.. ఈ సినిమా హిట్‌పై న‌మ్మ‌కంతో ఉన్న మ‌నోడు సినిమాకు ఖ‌చ్చితంగా రు. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే సుధీర్‌బాబు మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యాడ‌ని.. ఈ సినిమ‌కు రాజు రు. 3 కోట్ల వ‌ర‌కు సుధీర్‌కు ఆఫ‌ర్ చేశాడ‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

 

వీ సినిమా ట్రైలర్ లో ఎయిట్ ప్యాక్ బాడీతో రన్నింగులు, ఫైటింగులు చేస్తున్నట్టు కనిపించిన సుధీర్ బాబు సినిమా కోసం చాలా కష్టపడ్డారని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే సుధీర్‌బాబు బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌లో కూడా గోపీచంద్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news