Moviesర‌జ‌నీ - క‌మ‌ల్ సినిమా... క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌

ర‌జ‌నీ – క‌మ‌ల్ సినిమా… క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ హీరోస్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు యువ ద‌ర్శ‌కుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాపై ద‌ర్శ‌కుడు క‌న‌క‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల కాంబోలో సినిమాపై చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ని.. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమాలో రజనీకాంత్‌ నటిస్తార‌ని.. ఈ సినిమాకు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

 

ఇక లోకేష్ క‌న‌క‌రాజ్ కార్తీతో ఖైదీ సినిమాను నిర్మించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాడు. పూర్తి వివరాలను లాక్‌డౌన్‌ తర్వాత రాజ్‌కమల్‌ సంస్థ వెల్లడిస్తుందని లోకేష్‌ కనకరాజ్‌ తెలిపాడు. ఇక లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ రిలీజ్‌కు రెడీ కానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు క‌న‌క‌రాజ్ ఏకంగా క‌మ‌ల్ – ర‌జ‌నీ కాంబోలో సినిమా తెర‌కెక్కిస్తున్నాడంటే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news