Gossipsఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో నాగార్జున సినిమా ఫిక్స్‌... 15 ఏళ్ల లాంగ్...

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో నాగార్జున సినిమా ఫిక్స్‌… 15 ఏళ్ల లాంగ్ గ్యాప్‌తో…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ – కింగ్ నాగార్జున క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాబోతుందా ? అంటే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ ప్ర‌కారం అవున‌నే తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో 2003లో శివ‌మ‌ణి, 2005లో సూప‌ర్ సినిమాలు వ‌చ్చాయి. ఈ సూప‌ర్ సినిమాతోనే అనుష్క ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమా వ‌చ్చి 15 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున – పూరి కాంబోలో మళ్లీ సినిమా రాలేదు.

ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం మళ్లీ వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. పూరి జ‌గ‌న్నాథ్ ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి చేసే సినిమా నాగార్జున‌తోనే ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక క‌రోనా లాక్ డౌన్ వేళ ఎంతో మంది స్టార్ డైరెక్ట‌ర్లు ఇంట్లోనే ఉండి ఎన్నో క‌థ‌లు రాస్తున్నారు. ఇక హీరోలు కూడా డైరెక్ట‌ర్లు చెప్పే క‌థ‌లు వింటున్నారు.

ఇక క‌రోనా లాక్‌డౌన్‌లో పూరి నాగార్జున కోసం ప్ర‌త్యేకంగా రాసిన క‌థ  నాగార్జునను ఇంప్రెస్ చేసింద‌ట‌. గ‌తంలో పూరి – నాగ్ కాంబోలో వ‌చ్చిన సూప‌ర్‌, శివ‌మ‌ణి రెండు సినిమాల్లోనూ నాగ్ ను చాల కొత్తగా చూపించాడు పూరి. మరి ఇప్పుడు రాబోయే కొత్త సినిమాలో కూడా పూరి ఎలా ఉంటుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news