Moviesబ్రేకింగ్‌: క‌రోనాతో దిగ్గ‌జ హీరో త‌మ్ముడు మృతి

బ్రేకింగ్‌: క‌రోనాతో దిగ్గ‌జ హీరో త‌మ్ముడు మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతోమందిని బ‌లి తీసుకుంటోంది. ఇప్ప‌టికే సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా దెబ్బ‌తో మృతి చెందారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌రో దిగ్గ‌జ హీరో సోద‌రుడిని బ‌లి తీసుకుంది. బాలీవుడ్ లెజెండ్రీ న‌టుడు దిలీప్‌కుమార్ సోద‌రుడు అస్లామ్ ఖాన్ క‌రోనాతో మృతి చెందారు. దిలీప్ కుమార్ ఇద్ద‌రు సోద‌రులు అస్లామ్ ఖాన్‌, ఎషాన్ ఖాన్ ఇద్ద‌రూ శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డ‌డంతో గ‌త వారమే ఆసుప‌త్రిలో మృతిచెందారు.

వీరికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరికి క‌రోనా చికిత్స అందిస్తుండగా ప‌రిస్థితి విష‌మించ‌డంతో అస్లామ్ మృతి చెందారు. ఆయ‌న క‌రోనాతో పాటు డ‌యాబెటిస్‌, హైప‌ర్ టెన్ష‌న్ లాంటి స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతున్నారు. ఇక ఈ రోజు ఉద‌యం అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో మృతి చెందినట్టు ముంబై లీలావ‌తి ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news