Moviesమ‌రో రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌... తిరుగులేని టాలీవుడ్ రికార్డు

మ‌రో రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌… తిరుగులేని టాలీవుడ్ రికార్డు

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లోనూ వ‌రుస‌గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు. అల్లు అర్జున్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ ప‌రంగా అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ హిట్ల‌తో ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠపురంలో ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో అల్లు అర్జున్ న‌టిస్తాడు.

 

ఇదిలా ఉంటే టాలీవుడ్లో అల్లు అర్జున్ మ‌రో అరుదైన రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ కాలంలోనే 8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సాధించిన ఘనత సాధించారు. ఈ సంద‌ర్భంగా త‌న ఫాలోవ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అల్లు అర్జున్ 8 మిలియ‌న్స్ అనేది పాపులారిటీ కాద‌ని.. అంతులేని అభిమానం అని.. మీ ఆశీర్వాదాలు.. అంతులేని ప్రేమ‌కు కృత‌జ్ఞ‌తలు అని తెలిపాడు. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకు వ‌చ్చాడు. ఇంత త‌క్కువ టైంలో ఓ టాలీవుడ్ హీరో ఈ రేంజ్‌లో ఫాలోవ‌ర్స్ సాధించ‌డం గ్రేటే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news