Gossipsఈసారైనా అదృష్టం వరించేనా..?

ఈసారైనా అదృష్టం వరించేనా..?

‘దేవదాసు’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన రామ్ మొదటి సినిమాతోనే ఎంతో సీనియార్టీ ఉన్న నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన రామ్ మంచి ఎనర్జిటిక్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే వరుసగా ఎన్ని సినిమాలు తీస్తున్న పెద్దగా పేరు తెచ్చిన మూవీస్ ఏవీ లేవు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ మంచి హిట్ అయ్యింది.

ఆ మద్య నేను శైలజ పరవాలేదు అనిపించింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు అందుకుంటున్నాడు రామ్. ఇక టెంపర్ తర్వాత ఒక్క హిట్ లేకుండా కష్టాల్లో ఉన్న దర్శకుడు పూరిజగన్నాధ్. వీరిద్దరి కాంబినేషన్ లో ఫుల్ లెన్త్ మాస్ ఎంట్రటైన్ మెంట్ గా వస్తున్న మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఇటీవలే జరిగిన ఒక పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పూర్తయింది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.మణిశర్మ స్వరకల్పనలో వదిలిన నాలుగు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.మాస్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా నిధి అగర్వాల్ – నభా నటేశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు పూరి ఇటు రామ్ కి హిట్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఎంత వరకు మెప్పిస్తారో 18వ తేదీ వరకు వేయిట్ చేసి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news