Gossipsసినిమా చూడలేక మధ్యలో వెళ్లిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ..!

సినిమా చూడలేక మధ్యలో వెళ్లిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ..!

యువ హీరో విజయ్ దేవరకొండ కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడనడంలో సందేహం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ హీరోగా శుక్రవారం డియర్ కామ్రేడ్ సినిమా రిలీజైంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. నిన్న రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా చూసి మధ్యలో లేచి వెళ్లానని చెప్పాడు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈమధ్యనే దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతను హీరో కాకముందు యూఎస్ లో జాబ్ చేసేవాడని చెప్పాడు. అన్న సినిమాలు రిలీజ్ టైంలో ఆఫీస్ కు లీవ్ పెట్టి మరి ఆనంద్ విజయ్ సినిమాలను చూసేవాడట. అయితే ఓ సినిమాకు మాత్రం ఆనంద్ సినిమా మధ్యలోనే వెళ్లిపోయాడట. అది ఏ సినిమా అన్నది చెప్పలేదు కాని విజయ్ హీరోగా చేసిన ద్వారక, ఏమంత్రం వేశావే, నోటా ఈ మూడింటిలో ఒకటని గెస్ చేస్తున్నారు.

అన్న పడిన కష్టానికి ఇప్పుడు తనకు దక్కిన ఫలితం ఇప్పుడు ఉన్న క్రేజ్ అని అంటున్నాడు ఆనంద్ దేవరకొండ. దొరసానితో ఆనంద్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. విజయ్ దేవరకొండ మాత్రం డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసాతి తన సత్తా చాటాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news