Gossipsనయనతారపై నటుడి అసభ్యకర వ్యాఖ్యలు..!

నయనతారపై నటుడి అసభ్యకర వ్యాఖ్యలు..!

కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయనతారపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు రాధా రవి. దెయ్యంగా.. సీతగా నయనతార బాగా చేస్తుందని.. ఒకప్పుడు కె.ఆర్ విజయ లాంటి వారు అలా చేశారని అన్నారు. చూపులతో వల్లో వేసుకునే వారికి దేవతల పాత్రలు ఇస్తున్నారని అన్నారు రాధా రవి. అయితే నయనతారపై ఈ విధంగా మాట్లాడిన రాధా రవికి కోలీవుడ్ సిని ప్రముఖుల నుండి గట్టి షాకే తలిగింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాధారవిని తప్పుపడుతున్నారు.

నడిగర్ సంఘంపై కూడా కోలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. రాధా రవి మీద చిన్మయి, వరలక్ష్మి శరత్ కుమార్, విఘ్నేష్ శివన్ ఘాటు స్పందన తెలియచేశారు. అంతేకాదు విశాల్ కూడా రాధా రవి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. అంతటితోనే ఆగలేదు ప్రస్తుతం ఎలక్షన్స్ టైం వల్ల ఎలాంటి బ్యాడ్ నేం రాకూడదని నయనతార మీద చెడు వ్యాఖ్యలు చేసిన రాధా రవిని డి.ఎం.కే పార్టీ సస్పెన్స్ చేసింది.

రాధా రవి ఇదవరకు చిన్మయి విషయంలో కూడా టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ఓ ఆడియో వేడుకలో నయనతార మీద కామెంట్స్ చేసే సరికి అది ఆయనకే రివర్స్ గా కొడుతున్నాయి. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news