Gossipsఆ విషయంలో బాలయ్యకు బొమ్మ కనిపించిందా..?

ఆ విషయంలో బాలయ్యకు బొమ్మ కనిపించిందా..?

స్టార్ హీరో హోదాలో ఉండి..కొంత మంది నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన వారు ఉన్నారు. అయితే కొంత మంది సక్సెస్ అయినా..మరికొంత మంది దారుణంగా నష్టపోయి రొడ్డుమీదకు వచ్చినవారు కూడా ఉన్నారు. పాత తరం సినీ నటులు ఇలా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న కథలు ఎన్నో ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలో ఉన్నవారు సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ఎన్నో చూస్తుంటారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ ఇప్పటి వరకు వంద చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కూడా వరుసగా మూవీస్ లో నటిస్తున్నారు. మొదటి సారిగా బాలకృష్ణ నిర్మాతగా మారి తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ నిర్మించారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని భావించారు..ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

తీరా రిలీజ్ అయిన తర్వాత మిశ్రమ స్పందన రావడంతో నిరుత్సాహ పడ్డారు చిత్ర యూనిట్. కానీ ఈ సినిమాకి కనీసం ఏవరేజ్ టాక్ కూడా రాలేదు. లాభాల సంగతి పక్కన పడితే కనీసపు వసూళ్లు లేక బయ్యర్లు బోరుమంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన బ్యానర్ పై సినిమాలు చేసే ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయాలనుకున్న సినిమా కోసం నిర్మాతను వెతికే పనిలో పడ్డారు.

సినిమాను మొదట బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై తీయాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కొట్టిన దెబ్బకు బాలయ్యకు నిజంగా బొమ్మ కనపడి ఉండొచ్చని..అందుకే ఇప్పట్లో నిర్మాణాల జోలికి వెళ్లకుండా ఉంటారని ఫిలిమ్ వర్గాలు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news