Gossipsనాగ చైతన్య " సవ్యసాచి " రివ్యూ & రేటింగ్

నాగ చైతన్య ” సవ్యసాచి ” రివ్యూ & రేటింగ్

తారాగణం: అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమికా చావ్లా తదితరులు
దర్శకత్వం: చందూ ముండేటి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: యువరాజ్
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. దీంతో చైతూ నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచిపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చందూ ముండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో చైతూ అనుకున్న విజయాన్ని అందుకున్నాడో లేడో రివ్యూలో చూద్దాం.

కథ:
విక్రమ్ ఆదిత్య(నాగ చైతన్య) ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే ఒక జబ్బుతో బాధపడుతుంటాడు. అతడు తన అక్క(భూమికా చావ్లా)తో ఉంటుంటాడు. ఈ క్రమంలో కాలేజీలో చదుకునే చిత్ర(నిధి అగర్వాల్)ను చూసి ప్రేమిస్తాడు ఆదిత్య. కట్ చేస్తే.. ఆదిత్య మేనకోడలు కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు అనే మిస్టరీని చేధించే పనిలో ఆదిత్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఈ కిడ్నాప్‌ను ఎవరు, ఎందుకు చేశారు? ఆదిత్యతో వారికి ఉన్న సంబంధం ఏమిటి అనేది సినిమా కథ.

విశ్లేషణ:
సవ్యసాచి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో దర్శకుడు చందూ ముండేటి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను అంతే ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. నాగచైతన్య కెరీర్‌లో చేసిన బెస్ట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాలో వాటిని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఒక మామూలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే దీన్ని ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

ఇక కథాకథనం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌లో హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, తన స్నేహితులతో జరిగే సీన్స్‌తో కాస్త పర్వాలేదనిపించింది. అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంశాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌లో హీరో-విలన్‌ల మధ్య మైండ్ గేమ్‌ అంశాన్ని పెద్దగా వాడుకోలకపోయారు చిత్ర యూనిట్. దీంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సవ్యసాచి విజయం సాధించలేకపోయింది. ప్రీ-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో పెద్దగా పస లేకపోవడంతో సినిమా అయిపోయిందని రిలీఫ్ ఫీల్ అయ్యారు ఆడియెన్స్.

ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం సినిమాకు కొంతమేర బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా రీ-రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. పాటల్లో మాత్రం కీరవాణి ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయాడు. మొత్తంగా సవ్యసాచి టీజర్, ట్రైలర్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సినిమా చూశాక ఆవిరి కావడం ఖాయం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
చైతూ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. తన గత సినిమాలతో పోల్చుకుంటే యాక్టింగ్ పరంగా మెచ్యూరిటీ పెరిగిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు అసలుసిసలు ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మాధవన్ అనే చెప్పాలి. హీరోగా మనకు మాధవన్ సుపరిచితుడే. కానీ తొలిసారి తెలుగులో విలన్ పాత్రలో చెలరేగిపోయాడు. అతడి యాక్టింగ్ లెవెల్స్‌కు ఆడియెన్స్ ఇంప్రెస్ అవుతారు. సినిమాలో వెన్నెల కిషోర్‌తో పాటు చాలా మంది కమెడియన్లు ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారు. భూమిక తన పాత్రమేర బాగానే చేసింది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఓకే. మిగతా వారు తమ పాత్రలకు చేయాల్సిన న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
సవ్యసాచి అనే టైటిల్‌తో చందూ ముండేటి రాసుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో వెనుకబడింది. యాక్షన్, థ్రిల్, సస్పెన్స్ లాంటి అంశాలను సరిగా హ్యాండిల్ చేయడంలో చందూ ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం చందూ మెప్పించాడు. అయితే ఫ్లాట్‌గా సాగిపోయే నెరేషన్ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీరవాణి సంగీతం పర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా మొత్తం గ్రాండ్ లుక్‌లో కనిపిస్తుంది.

చివరగా:
సవ్యసాచి – ఎడమచేతి బలంతో చైతూ కొట్టలేకపోయాడు.

రేటింగ్: 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news