Gossipsహోటల్ లో హీరోయిన్ తో దొరికిపోయిన స్టార్ హీరో..!

హోటల్ లో హీరోయిన్ తో దొరికిపోయిన స్టార్ హీరో..!

టాలీవుడ్ ,కోలివుడ్, బాలీవుడ్ ఈ మూడు వుడ్స్ లో చాలా ఓపెన్ గా ఉండే వుడ్ మాత్రం బాలీవుడ్ మాత్రమే. వారు చేసే పనులకి పెద్దగా సీక్రెట్స్ పాటించరు.. కొంతమంది తెలుగు తమిళ సినిమా హీరో హీరోయిన్స్ లా సీక్రెట్స్ దాచుకోవదాలు నాన్చుకోవడాలు ఉండవు..వారిదంతా ఒక డిఫరెంట్ స్టైల్ లెండి..సరే ఆ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఇటువంటి విషయాలలో ఆరితేరిన హీరోలలో ముందుండే ఏకైక వ్యక్తి రణ్ బీర్ కపూర్..
1
అతడి ప్రేమాయణాలు చూస్తే చాంతాడు అంత పొడవు లిస్టు బయటకి వస్తుంది..వరసగా హీరోయిన్లతో ప్రేమాయణాలను నడిపిస్తూ అతి కొద్ది కాలంలోనే వారికి బ్రేకప్ లు చెప్తూ ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు ఈ కపూర్..ప్రస్తుతానికి అయ్యగారు బాలివుడ్ ఫమేస్ హీరోయిన్ అలియా భట్ తో కుచ్ కుచ్ హోతాహై లో మునిగి తెలుతున్నాడట..

అయితే వారికోసం క్రిటిక్స్ ఎందుకు పెద్దగా ఆలోచించడం అనుకున్నారేమో కాని చాలా సందర్భాలలో వీరు తమ ప్రేమని బహిర్గతం చేశారు కూడా….అంతేకాదు వీరిద్దరూ ఏకంగా ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో మకాం కూడా పెట్టేశారని తెలుస్తోంది..ఆ స్టార్ హోటల్ కి భారీ రేంజ్ లో అద్దె చెల్లించుతూ అక్కడే ఉంటున్నారట..ఈ విషయం మీడియాలో కోడై కూస్తోంది..

ఇదిలాఉంటే ఇదేమన్నా పెద్ద విషయమా రణభీర్ కపూర్ కి పెద్ద కొత్త కాదుకదా గతంలో కత్రినాకైఫ్ తో కూడా ఇదే తరహాలో మకాంపెట్టారు. ఒక ఖరీదైన ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని అప్పట్లో రణ్ బీర్, కత్రిన కైఫ్ లు కూడా ఇదే రీతిలో ఎంజాయ్ చేశారు కదా అంటూ మరికొన్ని వార్తా చానెళ్ళు ట్రోల్స్ వార్తలు గుప్పిస్తున్నాయాట అయితే ఆ తరువాత వారు ఇద్దరు విదిపోయారు అది వేరే విషయంలెండి..మరి ఆలియా భట్ , రణభీర్ కపూర్ ల ప్రేమాయణం స్టార్ హోటల్ నుంచీ సొంత ఇంటికి మారుతుందా లేక అక్కడే పులిస్టాప్ పడుతుందో వేచి చూడాలి అంటున్నారు క్రిటిక్స్..

.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news