Gossipsనిర్మాతకు త్రివిక్రమ్ డబ్బులు తిరిగిచ్చాడట..!

నిర్మాతకు త్రివిక్రమ్ డబ్బులు తిరిగిచ్చాడట..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం అరవింద సమేత సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో క్లారిటీ రావాల్సి ఉంది. జులాయి సినిమా నుండి త్రివిక్రం కేవలం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. రాధాకృష్ణతో త్రివిక్రంకు అలా కుదిరిందని అంటున్నారు. మిగతా నిర్మాతలకు త్రివిక్రంతో సినిమా చేయాలని ఉంటుంది ఆ క్రమంలోనే డివివి దానయ్య ఎప్పుడో త్రివిక్రంతో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాడట,

ఎప్పటికైనా త్రివిక్రం సినిమా చేస్తాడని ఆశిస్తున్న దానయ్యకు అది కుదరదని తెలిసి ఇక అతనితో సినిమా క్యాన్సిల్ చేసుకుంటున్నాడట. తను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని అన్నాడట. త్రివిక్రం కూడా దానయ్యకు అడ్వాన్సుగా ఇచ్చిన ఎమౌంట్ ఇచ్చేశాడని తెలుస్తుంది. భరత్ అనే నేను తర్వాత రాం చరణ్ సినిమా నిర్మిస్తున్న దానయ్య చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమాకు నిర్మాత దానయ్యే.

అందుకే ఆ సినిమాకు బడ్జెట్ అవసరం ఉంటుందని త్రివిక్రం కు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తీసుకున్నాడట. అది ఎంత ఏంటి అన్నది తెలియదు కాని త్రివిక్రం తో దానయ్య సినిమా కలలానే మిగిలిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news