Newsనా నువ్వే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా ఎన్టీఆర్..!

నా నువ్వే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా ఎన్టీఆర్..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా జితేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా నా నువ్వే. జూన్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరుపుతున్నారు. ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నాడట. అన్న సినిమాకు తమ్ముడు గెస్ట్.. ఈమధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదన్న వార్తలు రాగా వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఈ ఈవెంట్ లో ఇద్దరు సందడి చేయనున్నారు.

కళ్యాణ్ రామ్ లవర్ బోయ్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేశాయి. ఇన్నేళ్ల కెరియర్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్.టి.ఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేయనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news