Gossipsఅరవింద సమేత లో "అది" ఉండదంట..

అరవింద సమేత లో “అది” ఉండదంట..

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా రాబోతున్న సినిమా అరవింద సమేత. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కెరియర్ లో అజ్ఞాతవాసి ఫ్లాప్ ఊహించని త్రివిక్రం ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు పునరావ్రుతం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఇక త్రివిక్రం ప్రతి సినిమాలో ఓ కీర్తన ఉండాల్సిందే. అత్తారింటికి దారేది సినిమాలో దేవ దేవం భజే లానే అజ్ఞాతవాసిలో కూడా కృష్ణా.. సాంగ్ పెట్టారు. అజ్ఞాతవాసిలో ఆ పాట బాగున్నా ఎందుకో ఆడియెన్స్ కు ఎక్కలేదు. అందుకే రాబోతున్న అరవింద సమేతలో అలాంటి వాటికి జోలికి వెళ్లట్లేదట త్రివిక్రం.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కథ కాబట్టి యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తారట. చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ తో కత్తి పట్టించిన త్రివిక్రం రికార్డుల ఊచకోత మొదలు పెడతాడేమో చూడాలి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news