Gossipsరంగస్థలం చిట్టిబాబు దెబ్బకి కోలుకోలేకపోతున్న బోయపాటి !!

రంగస్థలం చిట్టిబాబు దెబ్బకి కోలుకోలేకపోతున్న బోయపాటి !!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రాం చరణ్ కెరియర్ లోనే కాదు నాన్ బాహుబలి రికార్డుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. 125 కోట్ల కలక్షన్స్ తో బాక్సాఫీస్ పై తన సత్తా చూపించాడు రాం చరణ్. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ నటన మీద మరింత అంచనాలు పెరిగాయి.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న రాం చరణ్ రంగస్థలం ఎఫెక్ట్ తో బోయపాటిని డైలమాలో పడేశాడు. బోయపాటి సినిమాలో హీరోల పాత్రలు మాస్ అండ్ కమర్షియల్ గా ఉంటాయి. అయితే చిట్టిబాబుగా చరణ్ ను చూశాక హీరో క్యారక్టరైజేషన్ మరింత క్రేజీగా తీర్చిదిద్దాడట. తనా హీరోల విషయంలో ఎప్పుడూ ఇంత ఆలోచించని బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నాడట.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కే మెగా నందమూరి కాంబినేషన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు రాం చరణ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news