Gossipsవిడుదలకి ముందు రంగస్థలం కి భారీ షాక్..మరి ఇంత దారుణమా..!!

విడుదలకి ముందు రంగస్థలం కి భారీ షాక్..మరి ఇంత దారుణమా..!!

రాం చరణ్ రంగస్థలం మూవీ తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సమైన క్యూరియాసిటీ పెంచగా ఓవర్సీస్ లో మాత్రం ఆ సినిమా ప్రీ రిలీజ్ బజ్ ఏమాత్రం లేదని అంటున్నారు. ముఖ్యంగా సినిమాను అక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఫీల్డుకి కొత్తట. అందుకే సినిమాకు తగినంత ప్రమోషన్స్ ఇవ్వట్లేదట. ఏదో మొక్కుబడిగానే ఈ వ్యవహారం నడుస్తుందని అంటున్నారు.

ఇక సుకుమార్ సినిమాలు హిట్ అయ్యేదాకా నమ్మకం తక్కువే. ఆర్య సీరీస్ లు కాకుండా మనోడు బాక్సాఫీస్ చెడుగుడు ఆడే సినిమా చేయలేదని చెప్పాలి. నాన్నకు ప్రేమతో కొంతమేరకు బెటర్ అయినా సరే రంగస్థలం మొదట ఆట పడే వరకు కష్టమే అని అంటున్నారు. ఈ కారణాలన్ని సినిమా ఓవర్సీస్ లో మైనస్ లుగా ఉన్నాయట. మాస్ సినిమా కాబట్టి అక్కడ ఆడియెన్స్ కు రీచ్ అవుతుందో లేదో అనుకుంటున్నారట.

ప్రీమియర్స్ కూడా చాలా తక్కువ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రీమియర్స్ తోనే టాక్ తేడా కొడితే అసలకే మోసం వస్తుందని భావించి కొన్ని చోట్ల మాత్రమే ప్రీమియర్స్ వేస్తారట. మరి రంగస్థలం ఫలితం ఓవర్సీస్ లో హంగామా సృష్టిస్తుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news