Moviesఅర్జున్ వర్సెస్ అర్జున్.. అంచనాలు బాగున్నాయి..!

అర్జున్ వర్సెస్ అర్జున్.. అంచనాలు బాగున్నాయి..!

సీనియర్ హీరోలంతా ఇప్పుడు కెరియర్ కొత్త టర్న్ తీసుకుని వారికి తగిన పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండ్ తో జగపతి బాబు విలన్ గా కొత్త టర్న్ తీసుకుని కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుండగా ఇప్పుడు అదే దారిలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా విలన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే మొదటి సినిమాగా నితిన్ తో చేసిన లై అంచనాలను అందుకోలేదు.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న నా పేరు సూర్య సినిమాలో అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. అర్జున్ వర్సెస్ అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ బాగుందని తెలియగానే బన్ని తన తర్వాత సినిమాలో కూడా అర్జున్ నే విలన్ గా తీసుకోనున్నాడట.
ప్రస్తుతం బన్ని తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తాడని అంటున్నారు. అఖిల్ తో కొరటాల శివా ఉన్నా బన్నితో చేశాకే అంటున్నారు. కొరటాల శివ సినిమాలో అర్జున్ నే విలన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాపై అఫిషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news