Newsబిగ్ బాస్ సెట్స్ దగ్గర నిరసన జ్వాలలు.. సంచలనంగా మారిన న్యూస్..!

బిగ్ బాస్ సెట్స్ దగ్గర నిరసన జ్వాలలు.. సంచలనంగా మారిన న్యూస్..!

బిగ్ బాస్ సెట్స్ పై దాడి చేసిన సంఘటన కోలీవుడ్ మీడియాలో సంచలన వార్తగా నిలుస్తుంది. ఈ నెల 15న టివి తమిళ బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్ లో దాదాపు 60 మంది సిని కార్మికులు వచ్చి నానా హంగామా చేశారట. తమ దగ్గర షూటింగ్ చేసుకుంటూ ఇక్కడ కార్మికులను వాడకుండా వేరే ఎక్కడి నుండో వర్కర్స్ ను తెప్పించారని వారి వాదన.

అయితే హిందిలో సక్సెస్ అయిన కారణంగా అక్కడి వారినే బిగ్ బాస్ హౌజ్ నిర్మాణంలో ఉంచామని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఫెఫ్సి కి చెందిన వారిని నియమించుకోవాలనేది వారి గొడవ. చెన్నై బెంగళూరు హైవే చెంబరంబాకం లో గల ఈవిపి ఫిల్మ్ సిటీలో తమిళ బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది.

కమల్ హాసన్ హౌజ్ మెట్స్ తో మాట్లాడుతున్న సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగిందట. దీనితో షూటింగ్ కు కొంత అంతరాయం కలిగిందట. అయితే బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తున్న విజయ్ టివి మాత్రం ఇదంతా తమ ఛానెల్ మీద వ్యక్తిరేకతతో చేస్తున్న పనే అంటూ కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇది ప్రత్యర్ధి ఛానెల్ పనే అంటూ ప్రెస్టిజియస్ ప్రోగ్రాంకు ఎలాగైనా సరే అంతరాయం కలిగించాలని చేస్తున్నారని విజయ్ టివి నిర్వాహకులు అంటున్నారు.

అయితే అసలు ఈ గొడవలు ఇప్పుడెలా చేస్తారని.. ఆల్రెడీ సెట్స్ వేసే టైంలో రాని ఈ వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందని విజయ్ టివి వారు అంటున్నారు. అయితే ఈ గొడవను దక్షణాది టివి నిర్మాతల సంఘం STEPS ముందు ఉంచారట. అయితే ఇద్దరి మధ్య సంధి కుదుర్చే మార్గం చేస్తున్నారని అలా కాని పక్షాన షూటింగ్ వేరే లొకేషన్ కు షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఈసారి హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్ వేసే అవకాశం ఉందట. ముంబైలో పూణెలో ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ సెట్స్ వేశారు. మరి బిగ్ బాస్ హౌజ్ సెట్ హైదరాబాద్ కు రానుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news