Newsదారుణం.. టీవీ నటిని రేప్ చేసి, చంపేసిన దుండగులు

దారుణం.. టీవీ నటిని రేప్ చేసి, చంపేసిన దుండగులు

Shocking incident happened in Tamilnadu. TV actress Jayaseeli raped and killed by unknown people in her own house. When neighbours found bad smell around her home, they inform police. They filed case and started investigation.

ఈ సమాజంలో రానురాను మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు వస్తున్నా.. రకరకాల చర్యలు తీసుకుంటున్నా.. వారిపై అత్యాచారాల పర్వం ఏమాత్రం ఆగడం లేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ.. తగ్గడం లేదు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతిఒక్కరూ దుండగుల బారినపడి బలైపోతున్నారు. తాజాగా మరో టీవీ నటి బలైంది. కొందరు ఆకతాయిలు ఆమె ఇంట్లోకే చొరబడి రేప్ చేయడమే కాకుండా అత్యంత దారుణంగా చంపేశారు. ఇంట్లో ఉన్న నగదు, నగల్ని కూడా దొంగలించారు. ఈ ఘటన తమిళనాడులోని సాలిగ్రామంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశీలి (49) అనే నటి టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే మోడలింగ్ కూడా చేస్తూ వస్తోంది. సాలిగ్రామంలోని పెరియార్ వీధిలో ఈమె చాలాకాలం నుంచి ఒంటరిగా ఉంటోంది. ఈమె ఇంటినుంచి దుర్వాసన వస్తుండడంతో.. చుట్టుపక్కలవాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకున్నారు ఇంట్లో జయశీలి నగ్నదేహం ఉండడం, పక్కనే కండోమ్ ప్యాకెట్స్ లభించడంతో.. ఆమెని రేప్ చేసి చంపేశారని పోలీసులు నిర్ధారించారు. హత్యకుముందు ఆమెపై అత్యాచారం జరిపి.. ఆ తర్వాత ఊపిరాడకుండా చంపినట్లు వారు పేర్కొంటున్నారు.

అక్కడ పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. ఇది తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే ఆమెని చంపేశారని, వెంటనే దుండుగుల్ని పట్టుకుంటామని తెలిపారు. స్నిఫర్ డాగ్స్‌ని తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news