Gossipsబ్రేకింగ్ న్యూస్ : మరో సెన్సేషన్ కి తెర తీయనున్న ఎన్టీఆర్...

బ్రేకింగ్ న్యూస్ : మరో సెన్సేషన్ కి తెర తీయనున్న ఎన్టీఆర్ !!

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. గ్యారేజ్ అందించిన సక్సెస్ ఊపులో ఏదో ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నారు అందరు. కానీ వారి ఆశలపై నీళ్ళు చల్లాడు ఎన్టీఆర్. గ్యారేజ్ విడుదల కావడం, సినిమా హిట్ కావడం.. జరిగిపోయి చాలా రోజులు గడుస్తున్నా తారక్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ సైన్ చేయలేదు.

అయితే మాకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఒక దిమ్మదిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట ఆ కథ చాలా బాగా వచ్చిందంట…అది కూడా అల్లు అర్జున్ తో కాంబినేషన్ లో కనుక ఆ సినిమా చేస్తే చాలా బాగుంటుందంట. ఆ సినిమా ని వర్కవుట్ చెయ్యడానికి చర్యలు జరుగుతున్నాయంట .అసలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే మహా పిచ్చి లేస్తుంది అభిమానులకి. నందమూరి అభిమానులని, మెగా అభిమానులని వేర్వేరుగా ఉన్నప్పటికినీ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రేమించే వారు, అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అవును ఇప్పటి ట్రెండుకి తగ్గట్లు హీరోలు అభిమానుల లెక్కలు మాని ఒక మంచి కథ కోసం కనుక కలిసి పనిచేస్తే బాహుబలి లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news